Wednesday, 5 August 2020

మరోసారి రచ్చ చేసిన ప్రగతి.. లేటు వయసులో ఘాటుగా! అమ్మడి వర్కవుట్స్ చూస్తే!!

టాలీవుడ్ సీనియర్ నటి ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అందుకు ఏకైక కారణం ఆమె హాట్ హాట్ వర్కవుట్స్. 44 ఏళ్ల వయసులో ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతూ ఆమె చేస్తున్న వర్కవుట్స్, డాన్స్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వెండితెరపై తల్లిగా, అక్కగా, వదినగా అలరిస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ప్రగతి.. నిజ జీవితంలో మాత్రం యమ హాట్ అంటున్నారు ఈ వీడియోలు చూసిన నెటిజన్లు. నేటితరం హీరోయిన్లే ఆశ్చర్యపోయేలా బాడీ ఫిట్‌పై శ్రద్ద తీసుకుంటున్న ప్రగతి.. తాను చేస్తున్న వర్కవుట్స్ అన్నింటినీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకుంటోంది. ఆన్‌లైన్ వేదికలపై ప్రగతి చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. స్టార్ హీరోయిన్లకు తీసిపోని విధంగా యువతను పిచ్చెక్కిస్తోంది. ఈ లాక్ డౌన్‌లో లుంగీ కట్టి ప్రగతి వేసిన స్టెప్పులు, మాస్ డ్యాన్సులు సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేశాయి. Also Read: తాజాగా మరోసారి ప్రగతి తన లేటెస్ట్ వీడియోలను పంచుకోవడంతో అవికాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇన్ని రోజులు వర్కవుట్స్, డాన్సులతో రచ్చ చేసిన ఈ అమ్మడు.. తాజా వీడియోల్లో మాత్రం కిక్ బాక్సింగ్‌ నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకోసం గంటల తరబడి చెమటోడ్చి కష్టపడుతోంది. లేటు వయసులో ఘాటుగా అమ్మడు చేస్తున్న ఈ వర్కవుట్స్, ఫిట్‌నెస్ కష్టాలు సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి క్యారెక్టర్స్ తెచ్చిపెడతాయో చూడాలి మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DDolcq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...