Friday, 28 August 2020

నితిన్ సినిమాలో శ్రియ.. హీరోయిన్‌గా మాత్రం కాదు!!

హీరో ప్రస్తుతం మంచి జోరుమీద ఉన్నారు. ‘భీష్మ’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్‌లో నితిన్ నటించనున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించిన ‘అంధాధున్’ మూవీ 2018లో విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ఈ సినిమాకు ప్రశంసలు అందాయి. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు కొన్ని నెలల క్రితం ప్రకటించారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ఈ ఏడాది జూన్‌లో పట్టాలెక్కిద్దాం అని భావించారు. కానీ, కరోనా వల్ల కుదరలేదు. Also Read: అయితే, ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు వచ్చాయి. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారని టాక్ వినిపించింది. అలాగే, టబు పాత్ర కోసం తెలుగులో నయనతారను సంప్రదించారని అన్నారు. అయితే, ఆమె రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారని టాక్. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ పాత్ర గురించి మరో రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ రీమేక్ మూవీలో టబు పాత్ర కోసం దర్శక నిర్మాతలు శ్రియా శరణ్‌ను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. ఆమె కూడా నటించడానికి పచ్చజెండా ఊపారని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ltBfeH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...