Tuesday, 18 August 2020

సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు ... సీబీఐకు అప్పగించాలన్న సుప్రీంకోర్టు

బాలీవుడ్ యంగ్ హీరో అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ మృతి కేసును సీబీఐకు అప్పిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేసులో సేకరించిన వివరాలన్నింటిని కూడా సీబీఐకు అప్పగించాలని మహరాష్ట్ర పోలీసుల్ని ఆదేశించింది. మరోవైపు మహా సర్కార్‌ను కూడా ఈ కేసు విషయంలో సీబీఐకు సహకరించాలని కోరింది. అవసరం అనుకుంటే కొత్తగా కేసు నమోదు చేసే అవకాశం కూడా సీబీఐకు కల్పించింది న్యాయస్థానం. జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌లో సుశాంత్ తండ్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు బీహార్, మహారాష్ట్ర మధ్య వివాదంగా మారింది. సీబీఐ దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌ను మహారాష్ట్ర తోసిపుచ్చింది. దీంతో కొందరు సుప్రీంను ఆశ్రయించారు. సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించాలని కొందరు రాజకీయ ప్రముఖులు సైతం డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిపై పలువురు డాక్టర్లు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని హత్య చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gcGoUt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...