Tuesday, 25 August 2020

మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్.. ఈ సారి ఏం చేశారంటే!!

కరోనా విజృంభణ కొనసాగుతుంటే తన వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తున్నారు సోనూ సూద్. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో.. చేతిలో పనిలేక, ఉపాధి కోల్పోయి సొంత గూటికి చేరలేక బిక్కు బిక్కుమంటున్న వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు చేర్చి ఆదుకున్న పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఈ సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్న ఆయన, తాజాగా మరోసారి కార్మికుల పట్ల ఔదార్యాన్ని చాటుకున్నారు. 20 వేల మంది వలస కార్మికులకు ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ''20 వేల మంది వలస కార్మికులకు వసతి, నోయిడా గార్మెంట్‌ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపారు సోనూ సూద్. ప్రవాసీ రోజ్‌గార్‌ ద్వారా ఈ మంచి పని కోసం అందరం కష్టపడ్డామని, ఎన్‌ఏఈసీ అధ్యక్షుడు లలిత్‌ ఠుక్రాల్‌ ఎంతో సాయం చేశారని, కార్మికులందరికీ ఆరోగ్యకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన‌ హామీ ఇచ్చారు. Also Read: లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక సమస్యలు, ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం సోనూసూద్‌ ఓ టోల్‌ ఫ్రీ నంబరు, మొబైల్ అప్లికేషన్‌ను కూడా ప్రారంభించారు. సాయం అవసరమైన వారు దీనిద్వారా అప్రోచ్ కావొచ్చని చెప్పారు. దీంతో సోనూ సూద్ ఔదార్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hsUZfM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...