Saturday, 22 August 2020

‘ఆచార్య’ మోషన్ పోస్టర్: బాస్ లుక్.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అంతే!

మెగాస్టార్ , డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి హిస్టారికల్ మూవీ తరవాత మెగాస్టార్ చేస్తోన్న కమర్షియల్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల సినిమా అంటే సోషల్ మెసేజ్ కూడా గ్యారంటీ. కాబట్టి, సినీ ప్రేమికులు సైతం ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. అయితే, తన పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు చిరంజీవి. Also Read: చిరంజీవి బర్త్‌డే గిఫ్ట్‌గా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది. ధర్మస్థలి అనే ఊరు.. చుట్టూ జనం.. ఆ జనం మధ్య ఎర్రకండువా వేసుకున్న ఒక యోధుడు చేతిలో చిన్నపాటి ఆయుధంతో వేటాడుతున్నాడు. ఆ వేటగాడే ‘ఆచార్య’. ధర్మం కోసం పోరాడే కామ్రేడ్. చిరంజీవిని వెనకనుంచి చూపించా ఇంపాక్ట్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ఆ డిజైన్, టైటిల్ అదిరిపోయాయి. వీటన్నింటికీ మించి మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంది. ఇన్ని రోజులూ మనం మిస్సయిన ఆ పాత మణిశర్మను గుర్తు చేసింది. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ ముందు ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా తాత్కాలికంగా ఆగింది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తరవాత షూటింగ్‌ను ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32eIiPr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...