Wednesday, 19 August 2020

కుండ, మట్టి, వాడేసిన పాల ప్యాకెట్.. సమంత చెప్పిన చిట్కా.. రకుల్, మంచు లక్ష్మితో మొదలు!!

మనం రోజూ తీసుకునే ఆహారం ఏదో విధంగా కల్తీ అవుతూనే ఉంది. మన తినే పండ్లు, కూరగాయలతో పాటు అవి సాగుచేయడానికి వినియోగించిన రసాయనాలను కూడా మన పొట్టల్లోకి పంపిస్తున్నాం. అందుకే, మన పూర్వీకులు చేసిన సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశం అవుతోంది. సేంద్రియ వ్యవసాయం ద్వారా సాగుచేసిన పండ్లు, కూరగాయలను తింటేనే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, ఎలా? బయట సేంద్రీయ పద్ధతిలో సాగు చేసేవారు ఎందరు? అందుకే, ఇప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్లే కూరగాయలను పండించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రూఫ్ టాప్ ఫార్మింగ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. అంతే, ఇంటి మేడపైనే వ్యవసాయం. నగరాల్లో ఇళ్లన్నీ చాలా ఇరుకుగా ఉంటాయి. కూరగాయలు పండించుకోవడానికి చోటు కూడా ఉండదు. అందుకే, మేడపై కూరగాయల మొక్కలు పెంచడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల డబ్బు ఆదా, ఆరోగ్యం పదిలం. అందుకే, ఈ పద్ధతిని స్టార్ హీరోయిన్ కూడా ఫాలో అవుతున్నారు. ఆమె చేయడంతో పాటు ఎదుటివారిలో ప్రేరణ కలిగిస్తున్నారు. Also Read: సమంత తన ఇంటిపైనే సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. దీనికి సోషల్ మీడియా ద్వారా #GrowWithMe అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రాచుర్యం కల్పిస్తున్నారు. తాను సాగుచేసిన కూరగాయలు, ఆకుకూరలను చూపిస్తూ సమంత ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ జర్నీలో తనను ప్రోత్సహించిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, తనలాగే అందరూ ఇళ్లలో కూరగాయలు పండించాలని సూచించారు. ఈ జర్నీలో తనకు అందరూ సహకరించినట్టుగానే.. తాను కూడా అందరికీ సహకరిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే కొన్ని వారాల్లో కలిసి ఈ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిద్దామని పిలుపునిచ్చారు. దీని కోసం ఒక కుండ, కొద్దిగా మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్ లేదంటే హైడ్రోపోనిక్ హోం కిట్ సిద్ధం చేసుకుని కూరగాయలను పండించాలని చెప్పారు. ఈ విధంగా చేయడం వల్ల మనలో ఎంతో మార్పు వస్తుందని.. తనని నమ్మండి అంటూ సమంత ఉత్తేజపరిచారు. అంతేకాదు, ఈ ఛాలెంజ్‌ను తన అభిమానులతో పాటు మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్‌కు విసిరారు సమంత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iZWC5f
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...