Thursday, 20 August 2020

విజయ్ దేవరకొండ హీరోయిన్ క్లీవేజ్ షో.. బోల్డ్ షోతో హీట్ పెంచేస్తోన్న బ్యూటీ

తమిళ బిగ్ బాస్ బ్యూటీ, నటి యషికా ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచేస్తోంది. ఇన్‌స్టా్గ్రామ్‌లో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు నయనానందాన్ని కలిగిస్తోన్న యషిక.. తాజాగా ఒక బ్యూటిఫుల్ పిక్‌ను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో యషిక క్లీవేజ్ షో ఓ రేంజ్‌లో ఉంది. ఈ ఫొటోను చూసిన అభిమానులు, ఫాలోవర్లు వాటేబ్యూటీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కొంత మంది అయితే అసభ్యకరంగా కూడా కామెంట్లు పెడుతున్నారనుకోండి. హీరోయిన్లకు ఇలాంటి కామెంట్లు ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి. ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. తమిళ సినీ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైంది. 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. 2015లో ‘ఇనిమే ఇప్పడితన్’ అనే సినిమాలో సంతానం పక్కన నటించింది. కానీ, తరవాత ఈ సినిమా నుంచి ఆమెను తొలగించారు. సాంగ్ షూట్‌కు హాజరుకాలేదనే కోపంతో మేకర్స్ ఈమె పాత్రను తప్పించారు. దీంతో 2016లో వచ్చిన ‘కవలాయి వేండమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది యషిక. జీవా, కాజల్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాలో యషిక స్విమ్మింగ్ ట్యూటర్ పాత్ర పోషించింది. విజయ్ దేవరకొండను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ‘నోటా’ సినిమాలోనూ యషిక నటించింది. అయితే, 2018లో తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా యషిక ఆనంద్ మంచి పాపులారిటీ సంపాదించింది. తన హాట్ అందాలతో తమిళ కుర్రాళ్లను పిచ్చెక్కించింది. చిన్న వయసులోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 4న యషిక 21వ ఏట అడుగుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ యషికాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు 2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q9JU7F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...