Friday, 28 August 2020

క్వశ్చన్ మార్క్ (?).. అదా శర్మ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్

పూరి జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అదా శర్మ.. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. కిందటేడాది రాజశేఖర్ ‘కల్కి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అదా శర్మ.. ఇప్పుడు థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మాతగా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ‘క్వశ్చన్ మార్క్ (?)’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు విప్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. టైటిల్‌ను ప్రకటించిన సందర్భంగా నిర్మాత గౌరీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారంతో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. మా సినిమా టైటిల్ ‘క్వశ్చన్ మార్క్ (?)’. టైటిల్ అందరికీ చాలా బాగా నచ్చింది.. విశేష స్పందన లభించింది. షూటింగ్ మొత్తం హైదరాబాద్, మహారాజపురం అడవుల్లో చేసాం. టైటిల్ మాదిరిగానే సినిమా కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది’’ అని తెలిపారు. Also Read: దర్శకుడు విప్రా మాట్లాడుతూ.. ‘‘మా నిర్మాత గౌరీకృష్ణ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుంది’’ అని వెల్లడించారు. హీరోయిన్ అదా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఇది మంచి హారర్ సినిమా. చాలా బాగా వచ్చింది. షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రానికి ‘క్వశ్చన్ మార్క్ (?)’ టైటిల్ పర్ఫెక్ట్. క్వశ్చన్ మార్క్ (?) ఏంటి దాని వెనుక కథ ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. నాకు ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు విప్రా, నిర్మాత గౌరీకృష్ణకి ధన్యవాదాలు’’ అని అన్నారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lsjfkU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...