Sunday, 30 August 2020

ఆ హీరోకి డ్రగ్స్ పిచ్చి.. భార్యను వదిలి నాతో డేటింగ్ చేస్తూ! షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన కంగన

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసే విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇండస్ట్రీలో నేపోటిజం రాజ్యమేలుతోందని, బ్యాగ్రౌండ్ లేని నటులను తొక్కేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న వేళ డీలర్లతో బాలీవుడ్ నటులకు సంబంధాలున్నాయని తెలుస్తుండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి వాట్సప్‌ చాటింగ్‌పై పోలీసులు ఆరా తీయగా ఆమెకు ఇండస్ట్రీ పెద్దలతో పాటు డ్రగ్స్ డీలర్లతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయని తేలడంతో ఈ అంశం ఎన్నో అనముమానాలు రేకెత్తిస్తూ పలు చర్చలకు తావిచ్చింది. సరిగ్గా ఈ తరుణంలో హీరోయిన్ మరోసారి రెచ్చిపోయింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగితే బాలీవుడ్ హీరోలంతా అడ్డంగా బుక్కవుతారని, అగ్ర నటులందరి రక్త నమూనాలు తీసుకుంటే ఎన్నో రహస్యాలు బయట పడతాయంటూ సంచలన కామెంట్స్ చేసిన కంగన.. తాజాగా డ్ర‌గ్స్ వివాదంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఓ స్టార్ హీరో డ్రగ్స్‌కి బానిసై ఆసుపత్రి పాలయ్యాడని చెబుతూ కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. Also Read: ఆ హీరో డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం కారణంగా అతని భార్య కూడా విడాకులు ఇచ్చేసిందని, ఆ స‌మ‌యంలోనే తాను అత‌నితో డేటింగ్ చేశానంటూ సంచలన కామెంట్స్ చేసింది కంగన. అయితే ఆ హీరో కుటుంబ సభ్యులు తనను వేధించారని పేర్కొంది. అలాగే ఇండస్ట్రీలో గురువు అని చెప్పుకునే వ్యక్తే తనకు డ్రగ్స్ రుచి చూపించాడంటూ మరో బాంబ్ పేల్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ కంపు కొడుతోందని, 99 శాతం మంది డ్రగ్స్ లేకుండా ఉండలేక పోతున్నారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది కంగన. అయితే ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G4e6Py
v

No comments:

Post a Comment