Tuesday, 18 August 2020

ప్రతి రాత్రి నా బెడ్‌పై ఆ ముగ్గురు మగాళ్లు.. వాళ్లెవరో కూడా చెప్పి షాకిచ్చిన హీరోయిన్ కస్తూరి

సీనియర్ మాటలతో ' ప్రోగ్రామ్' ప్రోమో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. ఆమె జీవితంలోని సీక్రెట్స్, ముద్దుముద్దుగా అనిపిస్తున్న మాటలు ఎపిసోడ్‌పై ఆసక్తి రేకెత్తించాయి.‌ ముఖ్యంగా 'నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు' అని కస్తూరి చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? కస్తూరి స్వయంగా ఎందుకు అలా చెప్పింది? అనే విషయంలో డైలమాలో పడ్డారు ఆడియన్స్. అయితే తాజాగా 'ఆలీతో సరదాగా ప్రోగ్రామ్' ఫుల్ ఎపిసోడ్ వచ్చేయడంతో ఆ ముగ్గురు మగాళ్లు ఎవరు అనే విషయం తెలిసిపోయింది. హీరోయిన్ కస్తూరి స్వీట్ వాయిస్‌తోనే ఆ ముగ్గురి పేర్లు వినిపించింది. ప్రతి నైట్ నా బెడ్‌పై ఆ ముగ్గురు ఉండాల్సిందే అని పేర్కొంటూ అందుకు కారణం కూడా చెప్పింది కస్తూరి. కార్యక్రమంలో భాగంగా.. నేను ఒకటి విన్నాను అది నిజమో కాదో చెప్పాలి. మీరు పడుకునే ముందు ముగ్గురు మగాళ్లకు ఏదో చెబుతారట. చెప్పే పడుకుంటారట నిజమేనా? అని అలీ అడగగానే అవును.. ''నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు'' అనేసి షాకిచ్చింది కస్తూరి. ఆ తర్వాత దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా పూర్తి వివరణ ఇచ్చింది. ''నా కూతరు అనారోగ్యంతో ఉన్నప్పుడు దాని పక్కన ఉండీ ఉండీ నిద్ర రాకుండా పోయింది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయే సమయంలో మళ్ళీ రిలాక్స్ కావడానికి ఆ ముగ్గురు మనుషులే కారణమయ్యారు. అందులో మొదటివారు ఇళయరాజా గారు. ఆయన పాటల వల్లే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. ఆయన నా లైఫ్‌లో దేవుడి లాంటి వారు. మరో వ్యక్తి ఫేమస్ తమిళ రచయిత పుదుమై పిత్తన్. ఆయన బుక్స్ చదివి రిలాక్స్ అయ్యాను. ఇక మూడో పర్సన్.. షిరిడీ సాయి బాబా. ఆయన వల్లనే నా కూతురు తిరిగి ఆరోగ్యంగా మారింది. అందుకే ఆ ముగ్గురి ఫోటోలు ప్రతి రాత్రి బెడ్‌పై పెట్టుకుంటానని చెప్పింది కస్తూరి. Also Read: తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతోమంది మనసు దోచేసిన కస్తూరి.. ఆలీతో సరదాగా మాట్లాడుతూ తన జీవితంలోని ఇంకెన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లి సంగతులు, పిల్లలు.. హీరోలపై క్రష్, ఇష్టమైన సినిమాలు ఎన్నెన్నో విషయాలు చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iQyTEj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...