Saturday, 1 August 2020

Bigg Boss Telugu 4: 'బిగ్ బాస్ 4' కీలక అప్‌డేట్.. రంగంలోకి దిగిన నాగార్జున.. ప్రోమో షూట్ ఫినిష్

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న '' ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. కరోనా కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ ఉండదేమో అని జనాల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇటీవలే ఈ షో టైటిల్ ప్రోమో రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించింది బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుంది? హోస్ట్ ఎవరు? అనే దానిపై జనాల్లో క్యూరియాసిటీ నెలకొన్న నేపథ్యంలో తాజాగా అప్‌డేట్‌తో దీనిపై క్లారిటీ వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే 'బిగ్ బాస్ 4' హోస్ట్‌గా మరోసారి నాగార్జుననే కనిపించబోతున్నారు. 'బిగ్ బాస్ 4' ప్రోమో షూట్ కోసం చాలాకాలం తర్వాత సెట్స్ పైకి వచ్చారు నాగార్జున. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో ఈ షో ప్రోమోను చిత్రీకరించారు. దీనికి దర్శకుడు కల్యాణ్ కృష్ణ (సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్) దర్శకత్వం వహించగా, ప్రముఖ కెమెరామేన్ కె.కె.సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. ఈ షూటింగ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ వాతావరణం సందడిగా మారింది. ఇందులో గెటప్ అదిరిందని అంటున్నారు. Also Read: తాజాగా షూట్ చేసిన ఈ 'బిగ్ బాస్ 4' ప్రోమో వీడియోను త్వరలోనే టీవీల్లో కూడా ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ షోలో కనిపించబోయే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా పూర్తయిందని తెలుస్తోంది. అతిత్వరలో షూట్ స్టార్ట్ చేసి ఆగస్టు నెలలోనే ప్రసారం చేసేలా ఏర్పాట్లు ముమ్మరం చేశారట. కాగా గత సీజన్‌లా 100 రోజులు కాకుండా ఈ సారి కేవలం 75 రోజుల్లోనే ఈ షో ఫినిష్ చేయబోతున్నారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/310yUOE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...