Tuesday, 11 August 2020

వినాయకుడు: 12 ఏళ్ల తరవాత బాలీవుడ్‌లో రీమేక్ అవుతోన్న కృష్ణుడు మూవీ!

సాయి కిరణ్ అడివి దర్శకుడిగా పరిచయమవుతూ 2008లో వచ్చిన చిన్న చిత్రం ‘వినాయకుడు’ పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇటు విమర్శకులతో పాటు అటు ప్రేక్షకుల మన్ననలు అందాయి. ఈ సినిమా ద్వారా హాస్యనటుడు కృష్ణుడు హీరోగా మారారు. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ సోనియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో పూనమ్ కౌర్ మరో ప్రత్యేక పాత్ర పోషించారు. భారీ కాయంతో బాధపడే ఒకబ్బాయి, అందమైన అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథే ఈ చిత్రం. మంచి కామెడీ, లవ్, ఎమోషన్‌తో ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే, 12 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘వినాయకుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి కిరణ్ అడివి హిందీ రీమేక్‌‌ను డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను హిందీలో స్వయంగా రీమేక్ చేయాలని డిసైడ్ అయిన సాయి కిరణ్.. పాపులర్ బాలీవుడ్ కమెడియన్‌కు కథ చెప్పారట. సాయి కిరణ్ నెరేషన్‌కు ఫిదా అయిపోయిన సదరు కమెడియన్.. సినిమా చేయడానికి అంగీకరించారని అంటున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Also Read: కాగా, ఈ సినిమాను ఇప్పటికే తమిళంలో రీమేక్ చేశారు. ‘వినాయగ’ టైటిల్‌తో రీమేక్ చేసిన ఈ చిత్రంలో కృష్ణుడుతో పాటు తమిళ స్టార్ కమెడియన్ సంతానం కూడా నటించారు. మరోవైపు, తొలి ‘వినాయకుడు’తో హిట్ అందుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడివి ఆ తరవాత ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కేరింత’, ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ వంటి సినిమాలను రూపొందించారు. ఇక ఈ సినిమాతో హీరోగా మారిన కృష్ణుడు.. ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gMlahe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...