Tuesday, 28 July 2020

Oviya: బిగ్ బాస్‌ హౌస్‌లో దాని కోసం ఒకటే టార్చర్.. వెంటనే బ్యాన్ చేయాలి.. సినీ నటి సంచలన కామెంట్స్

బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్. ఒక్క తెలుగులోనే గాక అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయింది. ఈ షో ద్వారా ఎంతోమంది సినీ నటులు ఫేమ్ అయ్యారు. కాకపోతే నిత్యం బిగ్ బాస్ షో విషయమై ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. షో చూడాలని ఉబలాటపడుతూ ఎంతమంది ఆడియన్స్ వేచి చూస్తుంటారో.. మరోవైపు అంతేమంది ఈ షోని వ్యతిరేఖిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా బిగ్ బాస్‌లో పాల్గొని పాపులారిటీ పెంచుకున్న ఓ సినీ నటి ఈ షోని బ్యాన్ చేయాలని చెప్పడంతో అంతా షాకయ్యారు. ‘కలవాని’ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నటి . తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించిన ఈమె.. తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని భారీ క్రేజ్ కొట్టేసింది. అయితే ఆ సీజన్ విన్నర్‌ ఆరవ్‌తో బిగ్ బాస్ హౌస్‌లో ఆమె చేసిన రొమాన్స్, జరిపిన ప్రేమాయణం, ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా నెటిజన్లతో జరిపిన సంభాషణలో ఓవియా.. బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని చెప్పడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. Also Read: సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేస్తుండగా ఓ నెటిజన్.. బిగ్‌బాస్‌ షోను నిషేధించాలన్న వాదనపై మీ అభిప్రాయం చెప్పండని ఓవియాను అడిగాడు. దీనిపై రియాక్ట్ అయిన ఆమె.. బిగ్‌బాస్‌ షోను తప్పకుండా నిషేధించాల్సిందేనని, అక్కడ టీఆర్ఫీ కోసం యమ టార్చర్ పెడుతుంటారని పేర్కొంటూ సంచలన కామెంట్స్ చేసింది. కంటెస్టెంట్స్ చచ్చిపోయినా పర్లేదు అనే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని.. అలాంటి షోని వెంటనే బ్యాన్ చేసేయాలని తెలిపింది. దీంతో మరోసారి బిగ్ బాస్ షో జనాల్లో చర్చనీయాంశంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30QMu7i
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...