Thursday, 2 July 2020

Nagnam Heroine: బాలయ్య అదీ ఇదీ అని పిలుస్తాడు.. కొడితే తిరిగి కొట్టేస్తా అని చెప్పా: నగ్నం స్వీటీ.. హాట్ కామెంట్స్

నగ్నం హీరోయిన్, వర్మ గారి స్వీటీ.. శ్రీ రాపాక వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇండస్ట్రీలో క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా 40పైగా చిత్రాలకు పైగా పనిచేసిన శ్రీరాపాకను ‘నగ్నం’ చిత్రంతో ఇండస్ట్రీలో మెరుపులు మెరిపించేలా చేశారు వర్మ. తన గురించి తాను చాలా ఎక్కువ చెప్పుకుంటూ.. నందమూరి బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ. ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు. ఎందుకంటే.. నేను ఎవరిదగ్గరకూ ఆర్టిస్ట్‌గా వెళ్లలేదు.. ప్రొఫెషనల్ డిజైనర్‌గా వెళ్లా. టెక్నీషియన్‌తో మాట్లాడటానికి భయపడతారు. గౌరవం ఇస్తారు. ఆర్టిస్ట్ అంటే అది అంటారు.. టెక్నీషియన్ అంటే మేడమ్ అంటారు. నా వరకూ నన్ను ఇండస్ట్రీలో పులి అంటారు.. శ్రీ మేడమ్ వచ్చేసింది.. పులి బాబోయ్ అంటారు. Read Also: అంతెందుకు నేను బాలక్రిష్ణ గారితో వర్క్ చేశా.. ఆయన మహిళా ఆర్టిస్ట్‌లను అదీ.. ఇదీ.. డామ్.. డిస్క్ అంటారు. నాకు మీటింగ్ ఎప్పుడూ ఆయన ఇంట్లోనే జరిగేది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్లాల్సి వచ్చేది. బాలయ్యకు కోపం ఎక్కువ అనే మాట నిజమే. షార్ట్ టెంపర్ ఉంది. ఆయనతో నేను ఆయన ఇంట్లోనే ఈ సినిమా కోసం 15-20 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆయన నన్ను చూసి నార్త్ అమ్మాయిని అనుకున్నారు. తెలుగు అని అనుకోలేదు. కాని నేను చాలా ట్రెడిషనల్‌గా చుడీదార్ వేసుకునే వెళ్లా. మరి ఆయనకు అలా ఎందుకు కనిపించానో తెలియదు కాని.. ఎక్కడ నుంచి వచ్చావ్ అన్నారు.. వెస్ట్ గోదావరి సార్!! అని అనగానే.. తెలుగు అమ్మాయివా అన్నారు. నేను ఎంత పులి అయినా.. ఆయన నాకంటే పెద్ద పులిలా ఉంటారు. ఆయనో లయన్. అందుకే కాస్త భయం భయంగానే ఆయన దగ్గర ఉన్నాను. భయం అని అనలేం కాని రెస్పెక్టబుల్ పర్శన్‌గా అనిపించారు. ఆయనతో డిస్కషన్ ముగిసిన తరువాత.. సార్!! ఓ రిక్వెస్ట్ అన్నాను.. ఏంటో చెప్పు అన్నారు బాలక్రిష్ణ గారు. ‘మీరు డిజైనర్స్‌ని కొడతారంట కదా..? నిజామేనా?? మీరు జూన్ 10న పుట్టారు.. నేను 13న పుట్టారు సేమ్ మెంటాలిటీ అని చెప్పా. ఎందుకంటే ఆయన కొడితే తిరిగి కొట్టేస్తా అని ఇన్ డైరెక్ట్‌గా చెప్పా. ఆయనది నిజంగానే కిడ్ మెంటాలిటీ.. చాలా సరదాగా ఉంటారు. అప్పుడే కోపం వస్తుంది.. అప్పుడే నవ్వేస్తారు.. ఆయనలాగే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ’ అంటూ తనను బాలయ్య బాబుతో పోల్చుకుంటూ తన గురించి తాను చాలా ఎక్కువ చెప్పేసుకుంది నగ్నం నటి శ్రీ రాపాక (స్వీటీ). Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31AY74d
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...