‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ . తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది నందిత. ఈ సినిమా తరవాత ‘బ్లఫ్ మాస్టర్’లో హీరోయిన్‌గా నటించింది. కిందటేడాది ‘కల్కి’లో కీలక పాత్ర పోషించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోన్న నందిత.. ‘IPC 376’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది ద్విభాషా చిత్రం. తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మితమవుతోంది. నందితా శ్వేత ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని పవర్ కింగ్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ప్రభాకర్ నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సంగీత దర్శకుడు థమన్ గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. నందితా శ్వేత పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ట్రైలర్‌లో రౌడీలను ఉతికారేస్తున్నారు. Also Read: ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతాయి. ఆధునిక యుగంలో సైన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటూ చెబుతూనే, అటు అతీంద్రియ శక్తుల ఉనికిని విజువల్స్‌లో చూపించారు. ‘‘రేప్ చేస్తారు, ప్రాణాలతో తగలబెడతారు, అమ్మాయిలను బతకనివ్వరా’’ అంటూ నందితా శ్వేత చెప్పిన ఎమోషనల్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ‘IPC 376’ ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. ట్రైలర్‌లోని వివిధ ఇంట్రెస్టింగ్ షాట్స్ చిత్ర కథ గత థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన నేపథ్యంతో ఉందని తెలుపుతున్నాయి. పోలీస్ అధికారి పాత్రలో నందితా శ్వేత ఫుల్ స్వింగ్‌లో నటించిందని ట్రైలర్ చూపిస్తోంది. యాదవ్ రామలిక్కమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు సి.కళాధర్ సాహిత్యం అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38oj1VJ
v
No comments:
Post a Comment