Friday, 24 July 2020

దగ్గుబాటి వారి ఇన్విటేషన్ వీడియో ఫేక్.. అవన్నీ తప్పే!

దగ్గుబాటి వారి పెండ్లి పిలుపు వీడియో శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ‘మాయాబజార్’ సినిమాలోని ఒక సన్నివేశంతో ఈ వీడియో ఇన్విటేషన్‌ను రూపొందించారు. నిజానికి ఈ ఇన్విటేషన్ చాలా బాగుంది. కానీ, ఇది దగ్గుబాటి వారు అధికారికంగా విడుదల చేసిన ఇన్విటేషన్ వీడియో కాదని ఆలస్యంగా బయటికి వచ్చింది. ఈ వీడియోను ఫ్యాన్స్ తయారుచేశారు. ఆ వీడియోలో ఉన్న వేదిక, సమయం కూడా తప్పు అని దగ్గుబాటి కుటుంబం అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 8న అంటే స్థిరవారం (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు మణికొండలోని ఖాజాగూడ చైతన్య ఎంక్లేవ్‌లో , మిహీకాల వివాహం జరగనున్నట్టు ఈ వీడియోలో చూపించారు. కానీ, ఇదంతా తప్పు. రానా, వివాహం ఆగస్టు 8న జరగనుండటం ఖాయం. కానీ.. వేదిక, సమయం వేరు. ఆ వివరాలను త్వరలోనే దగ్గుబాటి కుటుంబం ప్రకటించనుంది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చాలా తక్కువ మందితో ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నట్టు సమాచారం. కాబట్టి, కచ్చితంగా వివాహ వేదికను బహిరంగంగా ప్రకటించకపోవచ్చు. Also Read: కాగా, ఈ ఏడాది మే 12న రానా తన ప్రేమసి మిహీకా బజాజ్‌ను సోషల్ మీడియా ద్వారా రానా పరిచయం చేశారు. మిహీకాతో తన వివాహాన్ని ఖరారు చేస్తూ మే 21న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో రోకా ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో దగ్గుబాటి, బజాజ్ ఫ్యామిలీలు పాల్గొన్నాయి. ఈ వేడుక అయిన తరవాత రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం జరగనున్నట్లు చెప్పారు. ఒకవేళ అప్పటికి లాక్‌డౌన్ అమలులో ఉంటే కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పెళ్లి వేడుక జరుపుతామని స్పష్టం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D0gKEw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...