టీవీ నటుడిపై పదిమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. అన్ష్ బగ్రీ అనే నటుడు పలు హిందీ టీవీ సీరియల్స్‌తో పాటు.. పలు షోలలో కూడా నటిస్తుంటాడు. అయితే ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అన్ష్ నివాసానికి చేరుకున్న 10 మంది దుండగులు అతనిపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. ఈ దాడిలో అన్ష్ తలకు తీవ్రగాయాలు కావడంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడి వెనుక ఓ కాంట్రాక్టర్ హస్తం ఉన్నట్లు తేలింది. అన్ష్ తన ఇంటిని నిర్మించేందుకు ఓ కాంట్రాక్టర్‌ను మాట్లాడుకున్నాడు. అయితే నిర్మాణ సమయంలో అన్ష్‌తో అతనికి వివాదం తలెత్తింది. దీంతో ఆ కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు. అయితే అతడే ఆ కోపంతో అన్ష్‌పై దాడిచేసేందుకు కొంతమందిని పంపించాడు. శనివారం అన్ష్ ఇంటికి చేరుకున్న ఆ దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు గురించి ఆరా తీస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X7EcH5
v
No comments:
Post a Comment