Monday, 27 July 2020

ఆవిడ పర్మిషన్ తీసుకునే చేస్తా.. భయపడేదే లేదు.. బోల్డ్ సీన్లపై ఓపెన్ అయిన పాయల్ రాజ్‌పుత్

Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది పాల బుగ్గల పాప . ఆ సినిమాలో బోల్డ్ సీన్స్, అందులో ఆమె చేసిన పరకాయ ప్రవేశం యువతను పులకరింపజేసింది. దీంతో వరుస అవకాశాలు పట్టేస్తూ కెరీర్ గాడిలో పెట్టేసుకుంది ఈ పంజాబీ బ్యూటీ. ఈ క్రమంలోనే సీత మూవీలో ఐటెం సాంగ్, ఇటీవలే ''వెంకీమామ, డిస్కో రాజా'' సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ వెంటనే Rdxలవ్ సినిమాలో మరోసారి బోల్డ్ రోల్ చేసి మత్తెక్కించింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ముద్దుసీన్ల గురించి స్పందించింది పాయల్. Also Read: నేటితరం సినిమాల్లో ఘాడమైన లిప్‌లాక్ సీన్స్ కామన్ అయ్యాయి. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్ల డోస్ పెంచేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తన విషయంలో మాత్రం లిప్‌లాక్ సీన్స్ అంటే భయం లేదని అంటున్న పాయల్.. ముద్దు సీన్స్ చేయాలంటే మాత్రం ముందుగా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటానని చెప్పి ఆశ్చర్యపరిచింది. ''అది ఏ సినిమా అయినా సరే లిప్‌లాక్ సీన్ ఉందంటే ముందుగా వెళ్లి మా అమ్మను అడుగుతా.. ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అందులో నటిస్తా'' అని అంటూ ఓపెన్‌గా చెప్పేసింది పాయల్ రాజ్‌పుత్. లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా హోమ్ క్వారంటైన్ లోనే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌ని పలకరిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నరేంద్ర, 5w ప్రాజెక్ట్స్ ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P4UuvP
v

No comments:

Post a Comment