Saturday, 4 July 2020

ఝాన్సీకి కరోనా పాజిటివ్! దయచేసి ఎవ్వరూ కాల్ చేయొద్దంటూ క్లారిటీ ఇచ్చిన యాంకర్

దేశంలో కరోనా మహమ్మారి వీర విజృంభణ చేస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. పెద్దఎత్తున జనం కరోనా బారిన పడుతుండటం ఆదోళన కలిగిస్తోంది. పలువురు సినీ, సీరియల్ సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతుండటం చూస్తునే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే యాంకర్ ఝాన్సీకి కూడా కరోనా సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో కనిపించడంతో అంతా షాకయ్యారు. దీంతో తాజాగా ఇట్టి వార్తలపై ఆమె రియాక్ట్ అయింది. ఝాన్సీ నిర్వహించిన పరివార్ సీజన్ 2 షూటింగ్ సందర్బంగా పాజిటివ్ ఉన్న వారితో కాంటాక్ట్ కావడం వలన ఆమెకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు షికారు చేస్తున్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చిన ఝాన్సీ.. తాను సేఫ్‌గా ఆరోగ్యంగా ఉన్నానని, తనకు కరోనా పాజిటివ్ అంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేసింది. Also Read: ఎప్పుడైతే సీరియల్ నటి నవ్యకు కరోనా పాజిటివ్ అని తెలిసిందో.. అప్పటినుంచే తనకు కాల్స్ వస్తున్నాయని ఆమె చెప్పింది. అయితే తన ఆరోగ్యం గురించి కాల్ చేసి తెలుసుకున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పిన ఝాన్సీ.. తనకు కరోనా అంటూ వస్తున్న గాసిప్స్ గురించి మాట్లాడేందుకు మాత్రం ఎవ్వరూ ఫోన్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్‌లో పాల్గొంటున్న సమయంలో నటీనటులంతా చాలా జాగ్రత్త వహించాలని, సామాజిక దూరం పాటిస్తూనే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని సూచించింది. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా అని వస్తున్న వార్తలను తిప్పికొట్టింది ఝాన్సీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31JyU7W
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...