Thursday, 2 July 2020

మహేష్ బాబు డేట్స్ డౌట్‌గా ఉన్నాయని ఇలా ప్లాన్ చేశారట.. నిజంగా 'కాళాపోషకులే'!!

'' పేరుతో ఓ కొత్త సినిమా రాబోతోంది. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై , దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా చలపతి పువ్వుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమాను అతిత్వరలో సెట్స్ మీదకు తీసుకురానున్నారు. యూత్ ఆడియన్స్‌ని ఆకర్షించే లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సెంటిమెంట్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమా రూపొందించనున్నారు. 'ఆ నలుగురు' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం కానుండటం విశేషం. ఎలేందర్ మహావీర్ సంగీతం అందిస్తున్న 'కళాపోషకులు' టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్‌ని ప్రముఖ నిర్మాత విడుదల చేశారు. ఈ మేరకు 'కళాపోషకులు' చిత్రయూనిట్ మొత్తాన్ని పరిచయం చేస్తూ టీం విడుదల చేసిన వీడియో ప్రేక్షకలోకాన్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ''నా పేరు కథ.. సిల్వర్ స్క్రీన్ కథ'' అంటూ సినిమా గురించి చెబుతూ మొదట వెండితెరపై చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్‌ని చూపించి ఆకర్షించారు. ఆ తర్వాత ఈ కథలో మహేష్ బాబును హీరోగా తీసుకుందామంటే.. మహేష్ బాబు డేట్స్ డౌట్‌గా ఉన్నాయని, అచ్చం అలాగే ఉన్న విశ్వకార్తికేయ కార్తికేయను తీసుకున్నామని చెప్పి మరింత ఆకర్షించారు. Also Read: ఇక హీరోయిన్ విషయంలో దీపికా పడుకొనే అనుకున్నాం కానీ మా టీమ్ పడుకొనేని తీసేసి కొత్త అమ్మాయి దీపను తీసుకొచ్చారు. ఈ అమ్మాయి కూడా కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉందని చెబుతూ.. డైరెక్టర్ విషయంలో శంకర్, రాజమౌళి అనుకుంటే చివరకు చలపతి పువ్వుల చేతిలో ఈ కథ పడిందని అంటూ అట్రాక్ట్ చేశారు. మొత్తానికైతే ఈ డిఫరెంట్ ప్రమోషన్ చూసి వీళ్లెవరో నిజంగా 'కాళాపోషకులే' అని చెప్పుకుంటున్నారు జనం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VHAAuR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...