Saturday, 25 July 2020

అలాంటి ఉద్దేశ్యం లేదు.. క్షమాపణలు చెప్పిన హీరోయిన్ వనిత..

ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్ పెద్ద కూతురు వనిత తాజాగా మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లిపై కొందరు చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా స్పందిస్తోంది. వనిన మూడపెళ్లి చేసుకున్న వ్యక్తి తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. దీంతో వీరి వివాహం పట్ల సెలబ్రిటీలు సైతం తప్పు పడుతున్నారు. భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి ఎలా చేసుకుంటారని నిలదీస్తున్నారు. అయితే వనిత ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీనిపై స్పందించారు. మా ఊరు అయిన తంజావూరులో రెండు పెళ్లి చేసుకోవడం చాలా సహజం. అక్కడ చాలా మంది రెండు పెళ్లిళ్లు చేసుకున్నారన్నారు. కానీ తన వ్యక్తిగత కారణాల వల్ల తాను మూడో పెళ్లి చేసుకున్నానని... తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. దాంతో తంజావూరు ప్రజలు వనిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. వనిత కారణంగా తమ ఊరి పరువు పోయిందని ఆవిడ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. దాంతో వెంటనే తాను ఉద్దేశపూర్వకంగా ఏ రకమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన మాటలు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి అంటూ క్షమాపణలు కోరారు. Read More: వనితాపై సోషల్ మీడియా వేదికగా తంజావూరు ప్రజలతో పాటు నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీంతో వనిత తన అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసుకున్నారు. తిరిగి ఆమె మళ్ళీ అకౌంట్‌ని యాక్టివేట్ చేసి క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల తంజావూరు ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నట్లయితే వారికి నేను క్షమాపణలు చెబుతున్నానని ట్వీట్ చేశారు. ‘నా సోదర సోదరిమణులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కాదు. నా మాటల వెనుక ఎలాంటి ఉద్దేశ్యము లేదు. నా మాతృ భూమి అంటే నాకు ఎప్పటికి గౌరవం ఉంది. ’ అంటూ వనిత పేర్కొన్నారు. కొందరు తన మాటలను అనవసరంగా రాద్దాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D2WXnW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...