Sunday, 26 July 2020

నువ్వింకా బతికే ఉన్నట్లుగా ఉంది.. సుశాంత్ పై కృతిసనన్ ఎమోషనల్ పోస్ట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సారిగా నటించిన దిల్ బేచారా సినిమా విడుదలైన విషయం తెలిసిందే. సుశాంత్ సినిమాను చూసిన వారంతా మరోసారి భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన అభిమానులు తోటి నటులు సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం చూసిన సెలబ్రిటీలు సుశాంత్ నటనతో పాటు దర్శకత్వ ప్రతిభ గురించి ప్రశంసలు కురిపించారు. తాజాగా సుశాంత్ మాజీ గార్ల్‌ఫ్రెండ్ కృతిసనన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. సినిమా చూశాక తన మనసు మరోసారి విరిగిందని పోస్టు చేసింది. మ్యానీ పాత్ర చూస్తుంటే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు అనిపిస్తుంది. స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా బతికే ఉన్నావు అనిపిస్తుంది అని కృతి ఆవేదనతో పోస్టు పెట్టింది. Read More: ఏ సినిమాలో అయినా పాత్ర కోసం సుశాంత్ ఎంతగా ఇన్వాల్వ్ అవుతావో తనకు తెలుసంది కృతి. నీ మౌనం కూడా ఎన్నో విషయాలని చెబుతుంది అంటూ కృతి ఎమోషనల్ అవుతూ పోస్టు పెట్టింది. దర్శకుడు ముఖేష్ చాబ్రా గురించి మాట్లాడుతూ మీ మొదటి సినిమాతోనే మమ్మల్ని భావోద్వేగానికి గురి అయ్యేలా చేశావన్నారు. ఈ సినిమా ఆయనకు ఎంత స్పెషల్ అన్నది తనకు తెలుసన్నారు. సంజనా సంఫీుకు ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా శుభాకాంక్షలు తెలిజేసింది కృతిసనన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g5BuJD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...