Wednesday, 29 July 2020

నిహారిక కొణిదెల నిశ్చితార్థం ఫిక్స్.. వచ్చేనెలలోనే ముహుర్తం

మొదలయ్యింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిశ్చితార్థం త్వరలో కానుంది. ఇప్పటికే తనకు కాబోయే వరుడు గురించి మెగా డాటర్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది. Read More: అయితే వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని నాగబాబు సైతం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ .. తన సోదరి నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలిపారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీని ఒకే వేదికపై చూడవచ్చని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిహారిక పెళ్లి ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పెళ్లికి ముందే ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు నిహారిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుస్మిత ఒక ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓయ్ దర్శకుడు ఆనంద్ రంగతో ఒక వెబ్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X6PSK7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...