Thursday, 23 July 2020

వర్మ ఆఫీసుపై దాడి కేసులో ట్విస్ట్.. ఆ 8 మందిని వదిలేసిన పోలీసులు

వివాదాస్పద దర్శకుడు , జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరోపై ‘పవర్ స్టార్’ పేరుతో వర్మ సెటైరికల్ మూవీ తీయడమే దీనికి కారణం. ఈ సినిమా తీయడంతో పాటు వర్మ చేస్తోన్న వ్యాఖ్యల వల్ల పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్మ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ‘‘దమ్ముంటే వచ్చి నాపై దాడి చేయమనండి. నా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కొడితే వస్తుంది. ఎమ్మెల్యే కాలనీలో నా కంపెనీ ఉంది’’ అంటూ వర్మ బహిరంగ సవాల్ విసిరారు. వర్మ సవాల్‌ను స్వీకరించిన కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు గురువారం సాయంత్రం ఆయన ఆఫీసుకు వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వర్మ కార్యాలయం (ఆర్జీవీ కంపెనీ) వద్దకు వెళ్లి హంగామా చేశారు. అక్కడ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహంతో కార్యాలయం కిటికీ అద్దాలు పగలగొట్టారు. ఆఫీసు లోపలికి వెళ్లి వర్మను రమ్మనండి మాట్లాడాలి అంటూ వాదనకు దిగారు. దీంతో ఆర్జీవీ కంపెనీ కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఎనిమిది మంది పీకే ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేశారు. Also Read: అయితే, దాడికి పాల్పడిన వారిపై ఇచ్చిన ఫిర్యాదును వర్మ కార్యాలయం సిబ్బంది ఉపసంహరించుకోవడం గమనార్హం. రామ్ గోపాల్ వర్మ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో దాడికి పాల్పడిన ఎనిమిది మందిని జూబ్లీహిల్స్ పోలీసులు వదిలిపెట్టారు. అయితే, ఈ సంఘటన వర్మకే ప్లస్ అయినట్టు కనిపిస్తోంది. ఈ దాడితో మీడియాలో వర్మ పేరు ఇంకాస్త మారుమోగింది. గత కొద్దిరోజులుగా ‘పవర్ స్టార్’ సినిమాకు కల్పిస్తోన్న ప్రచారం కంటే.. ఈ దాడి వల్ల జరిగిన ప్రచారం మరింత ఎక్కువగా ఉంది. కానీ, వర్మ ఇప్పటికీ తగ్గడంలేదు. దమ్ముంటే చూసుకుందాం రండి అంటూ మరోసారి సవాల్ విసిరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eRFLyV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...