Friday, 24 July 2020

కేజీఎఫ్2 నుంచి మరో సర్ ప్రైజ్ వస్తోందా?

కేజీఎఫ్... 2018లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అన్ని భాషాల్లో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో హీరో యశ్‌కు అన్ని భాషాల్లో అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమాను ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. బంగారం అక్రమ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వేల్‌గా కేజీఎఫ్ 2 రానుంది. ఇందులో కూడా ప్రధాన పాత్రలో యశ్, హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాది జూలై 29న సంజయ్ బర్త్‌డే సందర్భంగా అధీరా పాత్రకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈసారి కూడా కేజీఎఫ్ నుంచి సర్‌ప్రైజ్ ఇస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 2 చిత్రంలో యశ్‌, సంజయ్ దత్‌ల మధ్య ఆసక్తికర పోరు ఒకటి ఉండనుందని అంటున్నారు. ఇది ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. ఇటీవలే యష్ కూడా ఈ సినిమాపై స్పందించాడు. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నాం. మొదటి భాగం కంటే రెండో పార్ట్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పాడు. Read More: వచ్చే నెలలో కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుండగా, ఇంకో 25 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖులు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓటీటీలో కేజీఎఫ్ సినిమాను విడుదల చేయట్లేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని యశ్ తేల్చి చెప్పాడు. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నాడు. అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32Qqs7m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...