Saturday, 6 June 2020

VirushkaDivorce: విడాకులకు రెడీ అయిన విరాట్- అనుష్క జోడీ.. సినీ క్రీడాభిమానులు షాక్!

ఎప్పటికప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో షిక్కర్లు కొడుతూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే విరాట్ కోహ్లీ- అనుష్క జోడీ విడిపోనున్నారని తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు సినీ క్రీడాభిమానులు. విరుష్క జోడీ విడాకులు తీసుకోబోతుందంటూ ట్విట్టర్‌లో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం అందరినీ టెన్షన్‌కి గురిచేసింది. ఆ తర్వాత అది ఫేక్ హ్యాష్ ట్యాగ్ అని, విరుష్క జోడీ విడాకులు తీసుకోవడం అనేది అబద్దం అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు జనం. టెక్నాలజీ విస్తరిస్తుండటంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తూ పలు చర్చలకు తెరలేపుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ క్రమంలోనే వారి దృష్టి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విరుష్క దంపతులపై పడింది. ఇంకేముంది ఈ జోడీ డివోర్స్ తీసుకోనుందంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి వైరల్ చేసేశారు. దీంతో ఈ అంశం నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతూ అలజడి సృష్టించింది. #VirushkaDivorce హ్యాష్ ట్యాగ్‌ను విరాట్, అనుష్క స్వయంగా ప్రమోట్ చేస్తున్నారనే ట్వీట్లు కూడా కనిపించడం మరింత కలవరపెట్టింది. అయితే హాయిగా దాంపత్య జీవితం కొనసాగిస్తున్న విరుష్క ఉన్నట్టుండి విడిపోవడమేంటి? అని ఆశ్చర్యపోయిన నెటిజన్స్ దీని వెనుక జరుగుతున్న తతంగాన్ని ఆరా దీశారు. అంతేకాదు ఈ న్యూస్‌పై రకరకాల మీమ్స్ పోస్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఇది కొందరు ఆకతాయిలు సృష్టించిన హ్యాష్ ట్యాగ్ తప్ప అందులో నిజం లేదని స్పష్టత రావడంతో కూల్ అయ్యారు. Also Read: 2016లో ఓ వెబ్‌సైట్‌ రాసిన ఫేక్ న్యూస్‌ని చూసి కొందరు నెటిజన్లు.. అసలు విషయం తెలుసుకోకుండా ఈ హ్యాష్‌ట్యాగ్‌ని సృష్టించారని తెలుస్తోంది. టాప్ మోస్ట్ సెలబ్రిటీలు కావడంతో క్షణాల్లో ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయి జనంలో గందరగోళం నెలకొల్పింది. దీంతో ఇలాంటి ఫేక్ హ్యాష్ ట్యాగ్స్, ఫేక్ న్యూస్‌లను అరికట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gZgJQJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...