Tuesday, 2 June 2020

Sarkaru Vaari Paata: బయటపడ్డ మహేష్ బాబు టాటూ సీక్రెట్.. అసలు రహస్యం ఇదే..!

'సరిలేరు నీకెవ్వరు' మూవీ తర్వాత సూపర్ స్టార్ చేయబోతున్న కొత్త సినిమా ''. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో హీరో మహేష్ బాబు మెడపై రూపాయి బిల్ల టాటూ కనిపించడం పలు చర్చలకు తెరలేపింది. ఇంతకీ మహేష్ ఆ టాటూ ఎందుకు వేసుకున్నారు? దాని వెనుక స్టోరీ ఏంటి? అనే దానిపై ఆరాదీయడం ప్రారంభించారు ఆడియన్స్. ఈ క్రమంలో మహేష్ టాటూ కథ విషయమై కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు రావడంతో సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై ఉన్న ఆతృత రెట్టింపయింది. మహేష్ బాబు మొహం కనిపించకుండా డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్‌లో చెవికి పోగు, మెడపై రూపాయి టాటూ బాగా హైలైట్ అయ్యాయి. అయితే దీనిపై తాజాగా అందిన సమాచారం మేరకు పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. 'సర్కారు వారి పాట' అనే పేరుకు తగ్గట్టుగానే కథ రెడీ చేసిన పరశురామ్.. బ్యాంక్‌కి సంబంధించిన చీటింగ్ సమస్యలపై పక్కాగా స్క్రిప్ట్ రాసుకున్నారట. ఇక ఈ సినిమాను అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఫినిష్ చేద్దామనుకున్న ఆయన మొదట మహేష్ బాబు మెడపై డాలర్ టాటూ వేయించాలని భావించారట. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా అమెరికా వెళ్లడం, అక్కడ షూట్ చేయడం కష్టం అనే నిర్ణయానికి వచ్చి ఆ కథను ఇండియాకు షిఫ్ట్ చేశారట. Also Read: ఈ క్రమంలో మొదట తాను రాసుకున్న కథలో స్వల్ప మార్పులు చేసి ఇండియా నేపథ్యానికి అనుగుణంగా దాన్ని మార్చేశారట. అందుకే మహేష్ మెడపై డాలర్ టాటూ క్యాన్సిల్ చేసి రూపాయి టాటూ వేశారట. ఆ టాటూనే ఇప్పుడు 'సర్కారు వారి పాట' ప్రీ లుక్ పోస్టర్‌లో హైలైట్ అవుతూ ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషమేమిటంటే.. ఇందులో మహేష్ బాబు క్యాసినో ప్లేయర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. క్లైమాక్స్‌లో గ్రామాలకు సంబంధించిన సందేశమిస్తూ ఆకట్టుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేష్ బాబు నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది ఆయన అభిమాన లోకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36WEm86
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...