RRR లాంటి భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దానయ్యకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారట. దానయ్యను పరీక్షించిన వైద్యులు ఆయనకి చిన్నపాటి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఆ శస్త్ర చికిత్స పూర్తయిందని, దానయ్య గుండెలో స్టంట్ వేశారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. దానయ్య ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని సమాచారం. ప్రస్తుతం దానయ్య డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారట. Also Read: ఇదిలా ఉంటే, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన దానయ్య.. 1992లో నిర్మాతగా టాలీవుడ్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. మొదటిగా సెన్సేషనల్ మూవీ ‘జంబ లకడి పంబ’ను నిర్మించారు. ఇప్పటి వరకు సుమారు 20 సినిమాలకు దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. వీటిలో చాలా వరకు హిట్లే. గడిచిన ఏడేళ్లలో ‘నాయక్’, ‘బ్రూస్ లీ’, ‘నిన్నుకోరి’, ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలను దానయ్య నిర్మించారు. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో RRR సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. Also Read: నిజ జీవిత పాత్రలను తీసుకొని కల్పిత కథతో తెరకెక్కిస్తోన్న RRR మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిపారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు లాక్‌డౌన్‌లో చాలా సడలింపులు తీసుకొచ్చింది ప్రభుత్వం. త్వరలోనే సినిమా షూటింగ్‌లు కూడా ప్రారంభంకానున్నాయి. షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైన తరవాత మొట్టమొదటిగా RRR షూటింగ్‌నే ప్రారంభిస్తారని అంటున్నారు. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, ఆలియా భట్‌తో పాటు ఇంగ్లిష్ నటులు ఒలీవియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cvkEkO
v
No comments:
Post a Comment