Sunday, 28 June 2020

అతను నా కంటే చిన్నవాడే.. కానీ డేటింగ్ వ్యవహారంలో గట్టివాడు: సీక్రెట్ చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్‌లో హీరో హీరోయిన్స్ డేటింగ్ వ్యవహారాలు, రూమ్ షేరింగ్ సంగతులు కామనే. సంవత్సరాల కొద్ది ప్రేమ పక్షుల్లా చెట్టాపట్టాలేసుకు తిరగడం వారికి మామూలు విషయమే. కాగా బాలీవుడ్ బ్యూటీ కొన్ని రోజులుగా తనకంటే 11 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మలైకా అరోరా అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా లాంటి యువ హీరో ఆమెను ప్రేమించి డేటింగ్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్భజ్ ఖాన్‌ను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న మలైకా ఆ తర్వాత అతినితో కట్ చేసుకొని అర్జున్ కపూర్‌తో డేటింగ్ లోకి దిగేసింది. గత కొన్నేళ్లుగా అతనితో ఎఫైర్‌ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు ఈ డేటింగ్ వ్యవహారంపై పెద్దగా స్పందించింది లేదు. దీంతో మలైకా- అర్జున్ కపూర్ మధ్య చెడిందని, ఆ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకోనున్నారనే సమాచారాలు ఈ మధ్యకాలంలో బాగా షికారు చేస్తున్నాయి. Also Read: సరిగ్గా ఇలాంటి సందర్భంలో అర్జున్ కపూర్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ ఫొటోతో స్వీట్ విషెస్ చెప్పింది మలైకా. అంతేకాదు ఓ మీడియాతో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచే కామెంట్ చేసింది. అర్జున్ తనకంటే 11 ఏళ్ళు చిన్నవాడైనా డేటింగ్ వ్యవహారంలో గట్టివాడంటూ సీక్రెట్ బయటపెట్టేసింది. మలైకా చేసిన ఈ కామెంట్ చూసి బీ టౌన్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. మరోవైపు ఏదీ దాచుకోని అర్జున్ కపూర్.. మలైకాతో పెళ్లి విషయంలో మాత్రం దాటేస్తూ రావడం విశేషం. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తాను పెళ్లి చేసుకోడానికి ఇంకా చాలా టైమ్ ఉందంటున్నాడు ఈ కుర్ర హీరో. దీంతో ఈ ఇద్దరు లవ్ ట్రాక్ నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగానే ఉంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31p68sQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...