వెండితెరపై ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ జీవితాన్ని ఆవిష్కృతం చేయనున్న సంగతి తెలిసిందే. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత దేశానికి ఒలింపిక్ పతకాన్ని సాధించిపెట్టిన కరణం మల్లేశ్వరి జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జూన్ 1వ తేదీ కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. కరణం మల్లీశ్వరి పాత్రలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలనే వేటలో పడ్డారు. ఈ క్రమంలో ముందుగా కీర్తి సురేష్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చివరకు తాప్సిని తీసుకోవాలని ఫైనల్ అయ్యారట. Also Read: ఈ మేరకు తాప్సితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కూడా ఈ బయోపిక్ చేసేందుకు ఆసక్తి చూపించిందని టాక్. కరణం మల్లీశ్వరి ఒలంపిక్స్ సాదించేందుకు పడిన తపన, ఆమె కృషిని ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపనున్నారట. అన్నీ కుదిరితే అతి త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూట్, నటీనటుల వివరాలు ప్రకటించనున్నారని తెలిసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ABDfhK
v
No comments:
Post a Comment