నందమూరి నటిసింహం బాలకృష్ణపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు . ఏనాడూ కూడా బాలయ్య అవినీతి, అక్రమాలు చేయలేదంటూ ఆయనకు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు పోసాని. ఆయన మాట్లాడుతూ.. ‘బాలయ్యకు కోపం ఎక్కువ అనే మాట వాస్తవమే.. అయితే ఆ కోపానికి కారణం ఉంటుంది. నేను ఆయన సినిమాలకు రాశాను. రెండు మూడు సినిమాలు ఆయనతో కలిసి చేశాను. చాలా డేసెంట్ అండ్ డెడికేట్‌గా ఉంటారు. చాలా హార్ట్ ఫుల్‌గా ఉంటారు.. మంచి ఉంటే మంచి చెడు అయితే చెడు అన్నట్టుగానే ఉంటారు బాలయ్య. అంతేకాని ముఖానికి తెర వేసుకోరు బాలయ్య. అంతా ఓపెన్.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. మేకప్ ముందు ఒక మాట మేకప్ తరువాత ఒక మాట ఉండదు. ఒట్టేసి ఒకమాట.. ఒట్టేయకుండా ఒకమాట చెప్పను అంటారు కదా.. ఆ డైలాగ్ బాలయ్యకి సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటాడు . ఆయన దగ్గర చిన్నోడు పెద్దోడు అనే తేడా ఉండదు. సీఎంని ఎంత గౌరవిస్తాడో.. నాలాంటి వాడిని అంతే గౌరవిస్తాడు. చాలా జన్యున్‌గా ఉంటారు. అవినీతి, అక్రమం చేద్దాం అనే ఆలోచనలు ఆయనలో ఉండవు. రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలయ్యతో సహా.. ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తీ కూడా అవినీతికి పాల్పడలేదు. రామారావుగారి కొడుకులు నిజాయితీగానే ఉన్నారు. వాళ్ల నాన్నగారి దగ్గరకు వెళ్లి పైరవీలు చేయడం లాంటివి లేవు.. బాలయ్య గారు రాంగ్ రూట్‌కి వెళ్లలేదు. ఆయన రూటు అది కాదు.. కష్టపడే డబ్బులు సంపాదించారు. అలాగే చిరంజీవిగారితో ఖైదీ నెం.150లో చేశా.. ఆయనకు నా నటన అంటే చాలా ఇష్టం. నేను చేస్తుంటే నా ముందు కుర్చీ వేసుకుని కూర్చునేవారు. చాలా సరదా మనిషి’ అంటూ చెప్పుకొచ్చారు పోసాని.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MFW2LX
v
No comments:
Post a Comment