Friday, 26 June 2020

ఆ హీరోల బాటలో రవితేజ.. యంగ్ టాలెంట్‌కు అవకాశం!!

సినిమా హీరోలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఓ వైపు నటిస్తూ మరోవైపు సినిమాలను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరిట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వాల్ పోస్టర్ సినిమా పేరిట నాని, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరిట రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరిట కళ్యాణ్ రామ్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ పేరిట సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ ఆఫ్ ద హిల్స్ పేరిట విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థలు ఏర్పాటుచేసి సినిమాలు నిర్మిస్తు్న్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మాస్ మహారాజా ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటుచేస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒక బ్యానర్‌ను ఏర్పాటుచేసి తాను హీరోగానే కాకుండా కొత్త కాన్సెప్ట్‌లతో వేరే హీరోలతో కూడా సినిమాలు నిర్మించాలని రవితేజ చూస్తున్నారట. ముఖ్యంగా తన ప్రొడక్షన్ హౌజ్ ద్వారా యంగ్ టాలెంట్‌కు అవకాశం ఇవ్వనున్నరని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. Also Read: ఇదిలా ఉంటే, రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ర‌వితేజ ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. స‌ర‌స్వతి ఫిలిమ్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ezlOOc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...