Friday, 5 June 2020

బాలయ్య బర్త్ డే వేడులకు చిరంజీవి.. అభిమానులకు పండగే !

టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు అగ్రహీరోల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న వార్తలు వరుసగా హల్ చల్ చేశాయి. మెగాస్టార్ , నందమూరి నట సింహం బాలకృష్ణకు మధ్య మనస్పర్థలు వచ్చినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిన్నింటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 10న . బాలయ్యఈ ఏడాది 60వ వడిలోకి అడుగు పెట్టబోతున్నారు. దీంతో కుటుంబసభ్యులు బాలయ్యకు షష్టిపూర్తి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఈవెంట్ ని బలంగా చేయాలని అభిమానులు ప్లాన్ చేసుకున్నారు. అటు నందమూరి ఫ్యామిలీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలో భాగంగా బాలయ్య నివాసంలో ఓ భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విందుకు నందమూరి కుటుంబంతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక ఈ ఈవెంటుకు చిరంజీవి కూడా రాబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అవును… తన స్పెషల్ బర్త్ డే వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్, టాలీవుడ్ ప్రముఖులను పిలవాలని భావించారు బాలయ్య. అయితే ప్రముఖుల్లో చిరంజీవిని కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారు బాలయ్య. ఇటీవల సినిమా షూటింగుల విషయమై... టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసింది. ఈ భేటీపై బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఎవరూ పిలవలేదన్నారు. అయితే ఈ విషయంలో చిరు, బాలయ్య మధ్య మనస్పర్థలు తలెత్తాయని టాలీవుడ్‌లో టాక్ నడిచింది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు బాలయ్య స్వయంగా చిరుని ఆహ్వానిస్తారని చర్చ సాగుతోంది. ఇదే క్రమంలో బాలయ్యతో ఎలాంటి సమస్యలూ లేవని చెప్పేందుకు చిరంజీవి కూడా ఈ షష్ఠిపూర్తి వేడుకకు హాజరు అవుతారని మెగా అభిమానులు సైతం అంటున్నారు. దీంతో బాలయ్య స్పెషల్ బర్త్ డే రోజు… 'చిరు - బాలయ్య' ఒకే వేదికపై ఆత్మీయంగా కలవబోతున్నారని అటు ఇద్దరు హీరోలు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h1d5pF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...