Monday, 1 June 2020

వైద్యుడిగా మారిన యంగ్ హీరో నిఖిల్

వైవిధ్యమైన సినిమాలతో యంగ్ హీరో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. నిఖిల్ ఎంచుకునే కథ, కథనాలే కాదు వాటిల్లో పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఇక నిఖిల్ - డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కార్తికేయ’ కూడా ఈ కోవకే చెందుతుంది. జంతువులను హిప్నటైజ్ చేయడమే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. Also Read: చందు మొండేటి దర్శకత్వంలోనే ‘కార్తికేయ 2’ టైటిల్‌తో రెడీ అవుతున్న ఈ సినిమాలో నిఖిల్ డాక్టర్‌గా నటిస్తున్నారు. ‘కార్తికేయ’లో మెడికల్ స్టూడెంట్‌గా నటించిన నిఖిల్.. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో డాక్టర్‌గా కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పేసారు ‘కార్తికేయ 2’ చిత్ర బృందం. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం (జూన్ 1న) ‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో చెతస్కోప్‌ను ఉంచారు.. అలాగే ‘‘వైద్యో నారాయణో హరి’’ అని ఒక శ్లోకాన్ని కూడా పొందుపరిచారు. అంటే, వైద్యుడే నారాయణుడు - నారాయణుడే వైద్యుడు అని అర్థం. ఈ పోస్టర్ ద్వారా కరోనాతో యుద్ధం చేస్తోన్న వైద్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది చిత్ర బృందం. కాగా, ‘కార్తికేయ 2’ సినిమాను తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధానంలో ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెడదామని భావించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో షూటింగ్ వాయిదా పడింది. లాక్‌డౌన్ ముగిసి ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XmSDYz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...