Monday, 8 June 2020

బాలయ్య బర్త్‌డే స్పెషల్.. పాటతో ఊపేస్తానంటోన్న నటసింహం

నటసింహా నందమూరి ఈనెల 10న తన 60వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ 60వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం బాలయ్య ఒక పాటను వదులుతున్నారు. ఈ పాటను ఆయనే స్వయంగా ఆలపించడం విశేషం. ఇటీవల యోయో టీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు. పాట రెడీ అవుతోందని.. కొద్దిరోజుల్లో వచ్చేస్తుందని చెప్పారు. ఆ మాట ప్రకారమే రేపు (జూన్ 9న) సాయంత్రం 5.30 గంటలకు తాను పాడిన పాటను విడుదల చేస్తున్నారు బాలకృష్ణ. ‘‘నిన్న తప్పుచేసిన వారిని నిలదీసింది ఆ గళం.. నేడు ఆ‘బాల’గోపాలాన్ని అలరించడానికి పాడింది అదే గళం..!’’ అని రాసి ఉన్న పోస్టర్‌ను ప్రస్తుతం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బాలకృష్ణ పాట పాడటం ఇది మొదటిసారి కాదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామా ఏక్ పెగ్‌ లా’ అంటూ బాలయ్య పాటందుకున్నారు. ఇది అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. మందు బాబులకు యాంథమ్ అయిపోయింది. మరి ఇప్పుడు బాలకృష్ణ ఎలాంటి పాటతో వస్తున్నారో చూడాలి. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది బాలయ్యకు 106వ సినిమా. మిర్యాల రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాత. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఒక ఫైట్ షూట్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసి ప్రభుత్వం అనుమతి ఇస్తే మళ్లీ షూటింగ్ మొదలవుతుంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MDFV1f
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...