ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు.. బాలయ్యపై చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించారు మెగాస్టార్ . తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలకు తనను పిలవకపోవడాన్ని తప్పు పడుతూ.. ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపాయి. ఆస్తుల పంచుకోవడం కోసమే ఈ మీటింగ్‌లు అంటూ బాలయ్య ఫైర్ కావడంతో కౌంటర్‌గా నాగబాబు రియాక్ట్ అయ్యారు. వెంటనే బాలయ్య క్షమాపణ చెప్పాలని.. లేదంటే చూస్తూ ఊరుకోం అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం నడించింది. ఇండస్ట్రీలోనూ రెండు వర్గాలు ఏర్పడి ఎవరి వాదనను వారు వినిపించారు. అయితే ఈ ఇష్యూపై మెగాస్టార్ చిరంజీవి ఘాటుగా స్పందించారు. నా తమ్ముడు నాగబాబు ఏది మాట్లాడినా సెన్సిబుల్‌గానే మాట్లాడతాడు.. సెన్స్‌తోనే మాట్లాడతారని అన్నారు చిరంజీవి. ఆయన మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు నాగబాబు వ్యాఖ్యల్ని ఖచ్చితంగా సమర్ధిస్తున్నా.. నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు నా తమ్ముడు. చాలా శాంతంగా ఉంటాడు.. మంచి వ్యక్తి. అనవసరంగా మాట్లాడే వ్యక్తి కాదు. కాని తాను హర్ట్ అయితే మాత్రం ఊరుకోడు. ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాడు. వెటకారంగా ఒకర్ని కించపరచాలని అనుకోడు. చాలా సంస్కారం గానే ఉంటాడు. కాని ఈ విషయంలో తను హర్ట్ అయ్యాడు. అందుకే ఇలా రియాక్ట్ అయ్యాడు. ఇదే పరిస్థితి నాకు వస్తే కనుకు.. అన్నీ దిగమింగుకుని భరిస్తాను తప్ప.. ఇలా ఓపెన్ కాను. అది నా నేచర్. కాని నాగబాబు నేచర్ అది కాదు. ఎవర్నీ ఏమీ అననటువంటి మా ఫ్యామిలీపై అనవసరంగా బురదజల్లి ఎటకారంగా మాట్లాడి.. కించపరిస్తూ.. సెన్స్ లేకుండా మాట్లాడితే.. తను హర్ట్ అయ్యాడు. దాని ప్రభావం మొన్న బయటపడింది. అది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే ఉండొచ్చు తప్ప.. తప్పు అని అనను. చిరంజీవి ఫ్యామిలీ సాఫ్ట్ టార్గెట్ అవుతుంది.. ఇదే మాట గతంలో కూడా అన్నాను. ఎందుకు అన్నానంటే.. నేను ఎవరితోనూ పెట్టుకోను. ఎవర్నీ ఏమీ అనను.. ఒకవేళ నన్ను ఎవరైనా ఏమైనా అంటే అక్కడితే వదిలేస్తా.. పెద్దది చేయను. పక్కన పడేసి.. నా పని నేను చేసుకుని వెళిపోతా. ఇది నా నేచర్. అందుకే ఇతన్ని ఏమైనా అనొచ్చనేది వాళ్ల నేచర్ కావచ్చు. నేను ఊరుకోవచ్చు.. నన్ను ప్రేమించే అభిమానులు, నా సోదరులు ఊరుకుంటారా? అవకాశం వస్తే వాళ్లు ఎందుకు ఊరుకుంటారు. అడగాల్సింది అడుగుతారు.. కడగాలంటే కడిగేస్తారు. ఇప్పుడే అదే జరిగింది’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UhT5VN
v
No comments:
Post a Comment