Tuesday, 2 June 2020

మ్యూజిక్ డైరెక్టర్ తల్లికి కరోనా.. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో షాక్!

దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, వేల సంఖ్యలో జనం ఈ వ్యాధితో మృతిచెందారు. కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇటీవలే కరోనా సోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ (42) మరణించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ వర్గాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. అయితే ఆ విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే వాజిద్ ఖాన్ తల్లి రజీనా ఖాన్‌కి కరోనా పాజిటివ్ అని తేలడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటికే వాజిద్ ఖాన్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబసభ్యులకు ఈ వార్త ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రజీనా ఖాన్‌ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వాజిద్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో.. తన కొడుకును చూసుకొనేందుకు రజీనా ఆసుపత్రిలోనే ఉండి సహాయపడింది. ఈ కారణంగానే ఆమెకు కూడా కరోనా సోకిందని సమాచారం. Also read: మరోవైపు ప్రముఖ సినీ నటి కుమారి సింగ్‌తో సహా ఆమె కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని తేలింది. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. తాజాగా కనిపిస్తున్న ఈ పరిస్థితులు, ఇండస్ట్రీలో పెరుగుతున్న కరోనా కేసులు సినీ వర్గాలను కలవరపెడుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gYfNMC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...