Friday, 26 June 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన అడివి శేషు, దేత్తడి హారిక

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలో భాగంగా నటుడు, దర్శకుడు అడివి శేషు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. యాంకర్, నటి అనసూయ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అడివి శేషు.. శుక్రవారం జూబ్లీ హిల్స్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడివి శేషు మాట్లాడుతూ.. ‘‘పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు. ఈ ఛాలెంజ్‌కు హీరోయిన్ శోభిత ధూళిపాళ, డైరెక్టర్ శశి కిరణ్‌లను నామినేట్ చేస్తున్నాను’’ అని అన్నారు. మరోవైపు, ప్రముఖ యూట్యూబ్ యాంకర్ దేత్తడి హారిక కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. హీరో నవీన్ కుమార్ (అభయ్ భేతిగంటి) ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీ హిల్స్‌లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం మొక్కలు నాటాలి’’ అని అన్నారు. ఈ సందర్భంగా యాంకర్ రవి, ఆర్జే చైతు, సింగర్ సాకేత్‌లను గ్రీన్ ఛాలెంజ్‌కు ఆమె నామినేట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YyfDEq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...