Monday, 1 June 2020

సమంతకు షాక్.. సోషల్ మీడియాలో డిగ్రీ సర్టిఫికెట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఎంత క్రేజ్ ఉందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. 2010లో ‘ఏ మాయ చేసావె’ అంటూ సినీ కెరీర్ ప్రారంభించిన సమంత పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం సమంతకు ఇనస్టాలో 10 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సమంతకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తన డిగ్రీ సర్టిఫికేట్ చూసిన సమంత సైతం షాక్ తింది. సమంత చెన్నైలోని స్టెల్లా మెరీ కాలేజ్‌లో బీకామ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2007లో ఆమె డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీలో సమంత ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారు. సర్టిఫికెట్‌లో సమంత పేరు సమంత రుతు ప్రభుగా ఉంది. అంతకు ముందు సీఎస్‌ఐ సెయింట్‌ స్టీఫెన్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో సమంతకు పదో తరగతిలో ఇచ్చిన సర్టిఫికెట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో గణితం-పార్ట్‌-1 లో 100కు 100 మార్కులు రాగా.. గణితం పార్టు-2లో 99 మార్కులు వచ్చాయి. మిగితా సబ్జెక్టులలో కూడా మంచి మార్కులే వచ్చిన సంగతి తెలిసిందే. సమంత ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు చూసిన అభిమానులంతా... ఆశ్చర్యపోతున్నారు. సమంత మంచి మెరిట్ స్టూడెంట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన డిగ్రీ సర్టిఫికెట్‌ను అభిమాని షేర్ చేయడంపై సమంత కూడా షాక్ తిన్నారు. ఇది నీకు ఎలా వచ్చిందని ఆమె అతన్ని ట్వీట్ ద్వారా ప్రశ్నించింది. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే దాన్ని డిలీట్ చేశాడు. అప్పటికే అది అందరికి చేరడంతో దాన్ని చాలా మంది షేర్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ కావడంతో ఆ అభిమానికి సర్టిఫికెట్ ఎలా వచ్చిందనేది ఆసక్తిగా మారింది. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మెన్ 2‘వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XjARp0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...