Wednesday, 3 June 2020

నాగ చైతన్య- సాయి పల్లవి 'లవ్ స్టోరీ'కి భారీ డిమాండ్.. ఎంటరైన బడా నిర్మాత!

అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా రూపొందుతున్న కొత్త సినిమా ''. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి నెలలోనే విడుదల కానుందని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం, ఆ వెంటనే లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఇప్పటికీ విడుదల కాలేదు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు మూవీ అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది చిత్రయూనిట్. గతంలో ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన ఇష్టసఖుడు నాగ చైతన్యను కాలర్ పట్టుకుని దగ్గరకు లాగుతూ.. కళ్లు మూసుకుని ప్రేమ తన్మయం పొందుతున్న సాయి పల్లవి లుక్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్స్‌ని బట్టి చూస్తే ఈ మూవీలో నాగ చైతన్య- సాయి పల్లవి రొమాంటిక్ డోస్ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేస్తుందని స్పష్టంగా తెలిసింది. దీంతో చిత్ర శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. Also Read: 'లవ్ స్టోరీ'కి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తానికి సేల్ అయ్యాయి. ఈ హక్కులన్నీ కలిపి మొత్తంగా 16 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. ఈ డీల్ టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ కుదుర్చుకున్నారని టాక్. ఇక ఈ సినిమా ఆగష్టులో థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఏది ఏమైనా ఈ ఫీల్ గుడ్ స్టోరీ కోసం యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36TLz8Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...