Tuesday, 2 June 2020

ఇండస్ట్రీని ఎవ్వరూ ఏమీ చేయలేరు.. బాలకృష్ణ ఇష్యూపై తేజ సంచలన వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో తాలూకు అంశాలు, ఆయన చేసిన కామెంట్స్ హాట్ ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ రీ ఓపెన్ విషయమై చిరంజీవి సహా సినీ పెద్దలంతా కలిసి సీఎం కేసీఆర్‌ని మీట్ కావడంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం, దానిపై మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్స్ వేయడం పలు చర్చలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఈ ఇష్యూపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న తేజ.. తాజాగా వైరల్ అవుతున్న అంశంపై తనదైన శైలిలో స్పందించారు. బాలకృష్ణ- నాగబాబు మధ్య జరుగుతున్న మాటల యుద్దాన్ని ఎలా చూడొచ్చని మీరు భావిస్తున్నారు? అనే ప్రశ్నపై బదులిచ్చిన తేజ.. ''ఎవరున్నా లేకున్నా ఇండస్ట్రీ పర్మినెంట్. మధ్యలో కొంతమంది వచ్చి ఇండస్ట్రీ నా వల్లే నడుస్తుందని అనుకుంటారు. కానీ ఇండస్ట్రీ శాశ్వతం. నాలాంటోళ్ళు ఎందరో వచ్చిపోతుంటారు. రామారావు గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది. సావిత్రి గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది. ఇలా ఎవ్వరూ లేకపోయినా ఇండస్ట్రీ నడుస్తోంది. బట్ ఇండస్ట్రీ తరఫున ఏ మీటింగ్ జరిగినా పెద్ద వాళ్లందరినీ పిలవాల్సిన అవసరం ఉంది'' అన్నారు. Also Read: అది ఇండస్ట్రీ గురించి జరిగిందో లేదో నాకైతే తెలియదు గానీ.. ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించిన విషయమైతే ఖచ్చితంగా చిరంజీవి గారిని పిలవాలి అలాగే బాలకృష్ణ గారిని పిలవాలని తేజ పేర్కొన్నారు. వాళ్ళే కాదు పరిశ్రమకు ఎవరైతే పిల్లర్ల లాగా ఉంటారో వారినందరినీ పిలవాలని తేజ అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ అని, ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదని అన్నారు. ఎవ్వరూ తక్కువ కాదు, ఎవ్వరూ ఎక్కువ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తేజ. కాకపోతే ఆ ఇష్యూ వెనకాల ఏం జరిగిందో తెలియకుండా దానిపై కామెంట్స్ చేయనని ఆయన తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MniR6U
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...