Sunday, 7 June 2020

అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్‌పై రూమర్స్.. అంతా తూచ్ అనేసిన డైరెక్టర్

నిఖిల్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ’ సినిమాకు సీక్వల్ రాబోతున్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ కుట్టీ అనుపమ ఫైనల్ చేశారని ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అనుపమ తప్పుకుందనే ప్రచారం ఊపందుకుంది. Also Read: ఈ క్రమంలో తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన డైరెక్టర్ చందూ మొండేటి ఆ వార్తలను ఖండించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అంతా తూచ్ అని చెప్పిన ఆయన.. అనుపమ తమ సినిమాలో నటిస్తోందని చెప్పారు. లాక్‌డౌన్ పూర్తయి షూటింగ్స్ రీ ఓపెన్ కాగానే కార్తికేయ-2ను తిరిగి సెట్స్ పైకి తీసుకొస్తామని, త్వర త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ప్రేక్షకులను మరోసారి థ్రిల్ చేస్తామని అన్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. అగ్రనిర్మాతలు టిజి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UkkM0h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...