Thursday, 14 May 2020

RED: కిక్కిచ్చిన రామ్, హెబ్బా పటేల్.. డించక్ డించక్ అంటూ రెచ్చిపోయారుగా!

ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ ఆడియన్స్‌ని హుషారెత్తించిన యంగ్ హీరో అదే ఊపులో RED మూవీ సెట్స్ పైకి వచ్చారు. మరోసారి మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగబోతున్నారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న‌ ఈ సినిమా నుంచి తాజాగా 'డించక్' అనే సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ రసిక ప్రియులకు మాంచి కిక్కిస్తోంది. ''డించక్ డించక్'' అంటూ వస్తున్న మాస్‌ బీట్‌పై రామ్‌, హెబ్బా ప‌టేల్ మాస్ స్టెప్స్ వేస్తూ రెచ్చిపోయారు. సాకేత్, కీర్తన శర్మ ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. మరోసారి మణిశర్మ బాణీలు మ్యాజిక్ చేశాయి. రామ్ స్టెప్స్, హెబ్బా అందాలు పాటకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని వేగంగా వ్యూస్ రాబడుతోంది. రామ్ బ‌ర్త్‌డే ట్రీట్ అదిరిందని అంటున్నారు ఫ్యాన్స్. 'తడమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా RED మూవీ రూపొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ సినిమాను శ్రీ స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. రామ్ సరసన నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటించగా.. హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేసింది. మణిశర్మ బాణీలు కట్టారు. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2y1derg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...