Friday, 15 May 2020

PENGUIN OTT Release: ఆన్‌లైన్‌లో కీర్తి సురేష్ మూవీ.. విడుదలకు ముహూర్తం ఫిక్స్

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలనకై మనదేశంలో లాక్‌డౌన్ కొనసాగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రద్దీ ప్రదేశాలైన థియేటర్స్, పబ్లిక్ పార్క్స్ క్లోజ్ చేసేసింది. మరోవైపు అన్ని సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొత్త సినిమాలేవీ విడుదల కావడం లేదు. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే పూర్తయిన సినిమాలను ఇంకా వాయిదా వేయడం సరికాదని భావిస్తున్న దర్శకనిర్మాతలు డిజిటల్ ప్లాట్‌ఫాం ఓటీటీల బాట పడుతున్నారు. లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం లాక్‌డౌన్ మొదలయ్యాక , ఆహా, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ పుంజుకున్నాయని తెలుస్తోంది. గతంతో పోల్చితే సబ్‌స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతున్నారట. ఇంట్లోనే కూర్చొని హెచ్‌డీ క్వాలిటీతో సినిమా చూసే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. అందుకే తమ తమ సినిమాలను ఓటీటీ వేదికలపై విడుదల చేసి లాభాలు గడించాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగానే తాజా సినిమా ‘’ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ ప్రకటన చేశారు ఆ చిత్ర నిర్మాతలు. తమిళం, తెలుగు వర్షన్లను ఒకేసారి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ ద్వారా జూన్ 19న‌ విడుద‌ల చేయనున్నట్లు తెలిపారు. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సమర్పిస్తున్న ‘పెంగ్విన్’ సినిమాకు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇందులో కీర్తి సురేష్ గర్భవతిగా కనిపిస్తూ డిఫెరెంట్ రోల్‌లో అలరించనుంది. ఈ మూవీ కీర్తి కెరీర్‌లో ఓ మెల్ స్టోన్ అవుతుందనే టాక్ ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cxEDjC
v

No comments:

Post a Comment