Tuesday, 5 May 2020

Pawan Kalyan: తమన్‌కి అగ్నిపరీక్షలా మారిన ‘వకీల్ సాబ్’!.. సాంగ్స్ పరిస్థితేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి పనిచేయడం అన్నది ఇండస్ట్రీలో చాలా మంది కల. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకునే వాళ్లు కొందరైతే.. ఆయన సినిమాకి టెక్నికల్‌గా పనిచేయాలనుకునే వాళ్లు చాలామందే. సినిమా హిట్ అవుతుందా? లేదా అన్న విషయాన్ని ముందుగానే హింట్ ఇచ్చేవి పాటలు. పాటలు మ్యూజికల్ హిట్ అయ్యాయంటే సగం గడంకట్టెక్కేసినట్టే. అన్ని సందర్భంల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని అనలేం కాని... చాలా సినిమాలకు మేజర్ ప్లస్ పాటలే. కాగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’‌కి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన 12 ఏళ్లలో ఎన్నో హిట్ చిత్రాలతో సెంచరీ క్రాస్ చేసిన తమన్.. పవన్ కళ్యాణ్‌తో తొలిసారి పనిచేస్తుండటంతో ఈ సినిమాకు హైప్ వచ్చింది. రీసెంట్ మ్యూజిక్ అందించిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని పాటలు మిలయన్లలో సెంచరీలను క్రాస్ చేసి మ్యూజికల్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇదే ఊపులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’కి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారట తమన్. ఇప్పటికే విడుదలైన ‘మగువా.. మగువా’ సాంగ్ మంచి ఫీల్‌తో కంటెండ్ బేస్డ్‌గా మంచి రెన్సాన్స్ రాబట్టింది. అయితే మిగిలిన సాంగ్స్ తమన్‌కి పెద్ద ఛాలెంజ్‌గా మారాయట. ‘వకీల్ సాబ్’.. సోషల్ కాన్సెప్ట్ మూవీ కావడంతో కథకు అనుగుణంగా ట్యూన్స్ రెడీ చేయడం, అదే సందర్భంలో పవన్ ఫ్యాన్స్‌కి కావాల్సిన కిక్ మిస్ కాకుండా కంపోజ్ చేయడం తమన్‌కి అగ్నిపరీక్షగా మారిందట. ఏది ఏమైనా ‘వకీల్ సాబ్’లో పవన్ ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచే విధంగానే సాంగ్స్ ఉంటాయని.. ఈ చిత్రం తన కెరియర్‌లో మరో మైలురాయి అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు తమన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తుండగా.. బోనీ కపూర్ సమర్పిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YCwIgN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...