Thursday, 14 May 2020

Nikhil Marriage: టాలీవుడ్‌లో మరో వికెట్ డౌన్.. మెగా మేనల్లుడి ఇంట్రెస్టింగ్ కామెంట్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు మరింత జోష్ పెంచేశారు. నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లోకి వస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసి అట్రాక్ట్ చేస్తున్నారు. తోటి హీరోల పుట్టిన రోజులు, పెళ్లిలపై తమదైన కోణంలో రియాక్ట్ అవుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరో పెళ్లిపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మను ఈ రోజు (మే 14వ తేదీ) ఉదయం 6 గంటల 31 నిమిషాలకు వేద మంత్రాల నడుమ పెళ్లాడారు. లాక్‌డౌన్ కారణంగా ఈ ప్రేమ వివాహం అతికొద్ది మంది సమక్షంలోనే జరిగింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నిక్ పాల్ జోడీని ఆశీర్వదిస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ''టాలీవుడ్‌లో మరో వికెట్ పడింది. జీవితంలో అతి పెద్ద అడుగు వేసిన నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నా. భవిష్యత్తులో మీ జీవిత ప్రయాణమంతా హ్యాపీ‌డేస్ తోనే గడిచిపోవాలని కోరుకుంటున్నా'' అన్నారు. మెగా మేనల్లుడు పెట్టిన ఈ కామెంట్ చూసి 'వావ్! వెరీ ఇంట్రెస్టింగ్.. మరి మీ వికెట్ ఎప్పుడో!' అంటూ నిఖిల్ జోడీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bwBRdl
v

No comments:

Post a Comment