Tuesday, 26 May 2020

Mahesh Babu: ప్రకాశ్ రాజ్ డిస్కవరీ వైల్డ్‌ ప్రోమోపై మహేష్ రియాక్షన్

ప్రకృతిలోని రమణీయతకు దృశ్యరూపం డిస్కవరీ. అడవులు, ఎడారుల్లోని వివిధ రకాల జంతువులు, చెట్లు, పక్షులు, పాములు జీవరాసులు సంబంధించిన అద్భుతమైన విజువల్స్‌ని కళ్లకు కట్టినట్టు చూపించే డిస్కవరీ అన్ని భాషల్లోకి విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ఆయా ప్రాంతీయ భాషల్లో పాపులర్ నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తూ డిస్కవరీ వైల్డ్ లైఫ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా విలక్షణ నటుడు .. వైల్డ్ కర్ణాటక పేరుతో డిస్కవరీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. జూన్ 5 శుక్రవారం రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘ఒకే అరణ్యంలో ఉండే.. అనేక రకాల జంతు సంపద కథ’ అంటూ వాయిస్ ఓవర్ అందించారు ప్రకాష్ రాజ్. తెలుగు, కన్నడ భాషల్లో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్స్ అందిస్తూ.. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను ట్విట్టర్‌లో విడుదల చేయడంతో సూపర్ స్టార్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ‘ప్రకాష్ రాజ్ గారూ.. మీ ఆసక్తికరమైన కథనం కోసం ఎదురు చూస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TLcPkC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...