Sunday, 3 May 2020

'ఆచార్య' నుంచి కాజల్ అవుట్.. క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్

చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా సినిమా నుంచి అగర్వాల్ తప్పుకుందని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఓ తమిళ సినిమా అడ్వాన్స్ తీసుకున్న ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన కాజల్ పీఆర్ టీమ్ ఆ వార్తలను ఖండించారు. 'ఆచార్య' నుంచి కాజల్ తప్పుకుందంటూ వస్తున్న వార్తలు నమ్మొద్దని పేర్కొన్నారు. సెట్స్ పైకి వచ్చేందుకు కాజల్ ఆతృతగా ఎదురుచూస్తోందని అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సామాజిక కోణంలో రూపొందుతున్న ఆచార్య సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా కన్ఫామ్ చేయగా అనూహ్యంగా ఆమె తప్పుకోవడంతో వెంటనే కాజల్‌ని సెలక్ట్ చేశారు దర్శకనిర్మాతలు. అయితే కాజల్ కూడా తప్పుకుందని వస్తున్న వార్తలు మెగా అభిమానులను నిరాశ చెందించడంతో వెంటనే స్పందించిన పీఆర్ టీమ్ అవన్నీ రూమర్స్ అని చెప్పేశారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండనుందని టాక్. ఇందులో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ రెజీనా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుండటం విశేషం. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మిగిలిన భాగం త్వరత్వరగా ఫినిష్ చేసి దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. మెగాస్టార్ 152వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. Aslo Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35uYgpN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...