Sunday, 17 May 2020

మహేష్ బాబు మైండ్ బ్లాక్ పాట కోసం వెయిట్ చేస్తున్న వార్నర్

ఆస్ట్రేలియా డైనమిక్ బ్యాట్స్ మన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా వార్నర్ టిక్ టాక్ వీడియోలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సౌతిండియన్ స్టార్స్ ‌ సినిమాలపై వార్నర్ ఫోకస్ పెట్టాడు. ఇక్కడ స్టార్స్‌కు సంబంధించిన పాటల్ని, డైలాగ్స్‌కు టిక్ టాక్ చేస్తూ... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాలో ఫేమస్ డైలాగ్ చెప్పిన వార్నర్... ఇప్పుడు మహేష్ బాబు పాటకు టిక్ టాక్ చేయాలనుకుంటున్నాడు. అయితే తనకు ఆ పాట దొరకడం లేదని చెబుతున్నాడు. వార్నర్ వీడియోలు చూసిన మహేష్ ఫ్యాన్స్ వార్నర్‌కు ఓ కోరిక కోరాడు. ఇటీవలే రిలీజైన మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాలో మైండ్ బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలంటూ వార్నర్ ను కోరాడు. 'మైండ్ బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలని, ఆ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. దీనికి వార్నర్ స్పందించాడు. "హేయ్, ఈ పాటకు నేను డ్యాన్స్ చేయలేను. ఎందుకంటే ఈ పాటను ఆస్ట్రేలియాలో ఉపయోగించుకునే అవకాశం లేదు. ఈ పాటతో వీడియో చేసేందుకు అవకాశం లభిస్తే తప్పకుండా చేస్తాను" అంటూ ట్విట్టర్ లో బదులిచ్చాడు. దీంతో త్వరలోనే వార్నర్ మైండ్ బ్లాక్ పాటకు స్టెప్పులేయడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మైండ్ బ్లాంక్ పాటతో మరి వార్నర్ అందరి మైండ్స్‌ను బ్లాక్ చేస్తోడో లేదో చూడాలి. ఇప్పటికే అల వైకుంఠపురములోని సూపర్ హిట్ పాటలకు భార్యతో కలిసి వార్నర్ చిందులేశాడు. బుట్ట బొమ్మ, రామలో రాములా పాటకు వార్నర్ డాన్స్ వేసిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X1mDYA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...