Monday, 25 May 2020

అప్పుడు అనసూయ.. ఇప్పుడు సుమ! స్టార్ హీరోలతో తెలుగు యాంకర్స్.. భలే స్కెచ్ వేశారే!!

బుల్లితెర యాంకర్స్ వెండితెరపై కూడా హంగామా చేస్తున్నారు. అనసూయ, రష్మీ, శ్రీముఖి, సుడిగాలి సుధీర్, ప్రదీప్ లాంటి వారు అటు బుల్లితెర ఆడియన్స్‌ని ఇటు సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన క్రియేటివిటీకి మరింత పదునుపెట్టి యాంకర్ సుమతో '' సినిమాలో కీ రోల్ పోషింప జేయాలని ఫిక్స్ అయ్యారట. గతంలో అనసూయకు 'రంగస్థలం'లో రంగమ్మత్త క్యారెక్టర్ ఇచ్చిన ఆయన ఈ సారి యాంకర్ సుమతో స్కెచ్ వేశారని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న 'పుష్ప' సినిమాలో హీరోకి అక్క పాత్ర ఒకటుందట. ఈ పాత్ర సినిమానే మలుపు తిప్పేదిగా ఉంటుందని టాక్. అయితే ఈ రోల్ కోసం అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యారట డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సో.. ఇప్పుడు 'పుష్ప' సినిమాలోనూ సుమకు అదే తరహా పాత్రను డిజైన్ చేశారని సమాచారం. అతిత్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర పేరు పుష్పరాజ్. లారీ డ్రైవర్‌గా పూర్తి మాస్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నారు బన్నీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. పల్లెటూరు అమ్మాయిగా ఆమె కనిపించనున్నట్లు టాక్. ఇటీవలే విడుదలైన 'పుష్ప' ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZyURpa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...